స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని నంద్యాలలో సామూహిక హనుమాన్ చాలీసా పఠనం
NANDYAL Oct03 :- దుబాయ్ విమాన ప్రమాద ఘటనలో వీరోచితంగా పోరాడి 176 మంది ప్రాణాలను కాపాడి భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పైలట్ స్మిత్ మచ్చర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం కన్వీనర్ డా. నేట్ల మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సామూహిక హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫోరం సభ్యులు, భక్తులు కలిసి హనుమాన్ చాలీసాను సామూహికంగా పఠించి, స్మిత్ మచ్చర్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించారు. దేశం కోసం, ప్రయాణికుల ప్రాణాల రక్షణ కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించిన పైలట్ స్మిత్ మచ్చర్ సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు
Arattai