హెచ్ఐవి బాలల కోసం పౌష్టికాహార ప్యాకెట్లు అందజేసిన రామ్ మోహన్ రావు
NANDYAL Nov 28:- నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ అధ్యక్షతన రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో , నెల్లూరు ప్రతిభ లయన్స్ క్లబ్ కు చెందిన ఎస్.ఎస్.వి.రామ్మోహన్ రావు హెచ్ఐవి బాలలకు పంపిణీ చేయడం కోసం తొమ్మిది రకాల పోషకాహార విలువలు కలిగిన సరకులతో రూపొందించిన పౌష్టికాహార పౌడర్ నూరు ప్యాకెట్లు నంద్యాల లయన్స్ క్లబ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధులుగా పాల్గొన్న లయన్స్ అంతర్జాతీయ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ లయన్స్ కౌన్సిల్ మాజీ చైర్మన్. ఏ.వి.ఆర్. ప్రసాద్ లు మాట్లాడుతూ రామ్ మోహన్ రావు గత 15 సంవత్సరాలుగా ప్రతినెల 300 కేజీల పౌష్టికాహార పౌడర్ ప్యాకెట్లు తయారు చేయించి వివిధ ప్రాంతాలలో హెచ్ఐవి, క్యాన్సర్ తదితర బాధితులకు అందజేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.
రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ పౌష్టికాహార పౌడర్ వ్యాధిని తగ్గించే ఔషధం కాదని,వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తుందని అన్నారు.
తొమ్మిది రకాల పోషకాహార సరకులతో ఈ పౌష్టికాహార పొడిని స్వచ్ఛత ప్రమాణాలు పాటిస్తూ తయారుచేసి అందిస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా రామ్ మోహన్ రావును నంద్యాల లయన్స్ క్లబ్ శాలువా, జ్ఞాపిక లతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్, మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్,లయన్స్ జిల్లా మెంబర్ షిప్ చైర్మన్ రవి ప్రకాష్,రీజియన్ చైర్మన్ నిజాముద్దీన్,లయన్స్ జిల్లా పి.ఆర్.ఓ. సుధాకర్ రెడ్డి,సీనియర్ సభ్యు లు ఆంజనేయులు గుప్తా, డాక్టర్ సహదేవుడు, భవనాసి నాగ మహేష్ అధిక సంఖ్యలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
Arattai