ఏ. కోడూరు ఎంపీటీసీ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఘన విజయం
NANDYAL Oct07 :- నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం ఏ. కోడూరులో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిడుతూరి సౌదామిని విజయం సాధించారు.తన ప్రత్యర్థులపై 156 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.ఎన్నికల ఫలితాలు వెలువడటంతో ఏ. కోడూరులో వైసీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు సౌదామినికి అభినందనలు తెలియజేశారు.ఈ విజయంతో గ్రామంలో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు

ఈ సందర్భంగా మిడుతూరు సౌదామిని.లాలి స్వామి.మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి ఏకోడూరు వైఎస్ఆర్సిపి నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఖాదర్, దస్తగిరి, ముట్టు, జావలి మస్తాన్, వెంకటేశ్వర్ రెడ్డి, బాలస్వామి తదితరులు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Arattai