నంద్యాలలో ఘనంగా రైతు బాంధవుడు ఎన్.జి. రంగా జయంతి
NANDYAL Oct07 :- నంద్యాల జిల్లా, నంది రైతు సమాఖ్య కార్యాలయంలో రైతు నాయకులు, రైతు ఉద్యమ పితామహుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు బాంధవుడు ఎన్.జి. రంగా జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ గారు అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్.జి. రంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అతిధులుగా పాల్గొన్న రామసుబ్బారెడ్డి, డాక్టర్ దీవి హయగ్రీవాచారి, డాక్టర్ గెలివి సహదేవుడు తదితరులను నంది రైతు సమాఖ్య సభ్యులు ఘనంగా సత్కరించారు.అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ గారు మాట్లాడుతూ, ఎన్.జి. రంగా గారి పోరాటాలను, రైతు సేవలను కొనియాడారు. జమీందారీ వ్యవస్థ నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన భారత రైతాంగ ఉద్యమ పితగా ఆయనను అభివర్ణించారు. తన జీవిత కాలంలో 65 పుస్తకాలు రాసిన ఘనత ఎన్.జి. రంగా గారికి దక్కుతుందని తెలిపారు.

డాక్టర్ హయగ్రీవాచార్యులు గారు రంగా గారి జీవిత విశేషాలను వివరిస్తూ, ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడని, ఆయన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఉత్తమ రైతు రామసుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ, రైతులు నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని సూచించారు.డాక్టర్ సహదేవుడు గారు రైతు కవితలు వినిపించి, ఎన్.జి. రంగా గారి రాజకీయ జీవితాన్ని వివరించారు.శాస్త్రవేత్త మాధవ స్వామి గారు మాట్లాడుతూ, పార్లమెంట్ సభ్యునిగా లోక్ సభలో రైతు సమస్యలపై గళం విప్పిన మంచి పార్లమెంటేరియన్ గా రంగా గారిని కొనియాడారు. సమిష్టి సహకార వ్యవసాయ విధానాన్ని వ్యతిరేకించిన రైతు నాయకుడని, ఎన్నో సంవత్సరాలు పార్లమెంట్ సభ్యునిగా ఉండి గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన గొప్ప పార్లమెంటేరియన్ అని అన్నారు.కవులు మహమ్మద్ రఫీ, నీలకంఠమాచారి “నేటి రైతుల వ్యవసాయం” అనే అంశంపై కవితలు వినిపించారు.ఈ కార్యక్రమంలో నంది రైతు సమాఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ ఓబుళపతి, మాధవ స్వామి, శంకరప్ప, రైతులు హరినాథ్ రెడ్డి, జయరాం రెడ్డి, కార్యాలయ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్, బాలచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.
Arattai