గుంతనాల గ్రామం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి విజయభేరి మోగించిన కాణాల సుదర్శనం
NANDAYAL Nov28:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గుంతనాల గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కాణాల సుదర్శనం గారు ఘన విజయం సాధించి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.

ఈ విజయానికి ప్రముఖ టీడీపీ నాయకులు ఫరూక్ సార్ అందించిన ఆశీస్సులు, వారి తనయులైన ఫిరోజ్ గారు, ఫయాజ్ గారు అందించిన అండదండలు, సహాయ సహకారాలు ఎంతగానో తోడ్పడ్డాయి. అదేవిధంగా బాల అకాడమీ వ్యవస్థాపకులు కొండయ్య గారు, వారి తనయుడు ఎం.జి.ఎఫ్. లయన్ రవీంద్రనాథ్ గారు అందించిన ప్రోత్సాహం, సహాయ సహకారాలు కూడా ఆయన విజయానికి మరింత బలాన్ని చేకూర్చాయి.
ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కాణాల సుదర్శనం గారికి పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, విద్య తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి గుంతనాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ప్రజల ఆదరణతో సాధించిన ఈ విజయాన్ని గ్రామ అభివృద్ధికి అంకితం చేస్తూ, ప్రజాసేవలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని నూతన సర్పంచ్ కాణాల సుదర్శనం గారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
Arattai