ఈనెల 29న నంద్యాల బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తిక మాస వనభోజనాలు
NANDYAL Nov 27:- నంద్యాల పట్టణంలో ఈనెల 29 తేదీ ఆదివారం బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని నంద్యాల పట్టణం,మూలమఠం ఎదురుగా, నూతనంగా నిర్మిస్తున్న బలిజ సంఘీయుల కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నంద్యాల, గోస్పాడు,మహానంది మండలాలకు చెందిన బలిజ సంఘీయులు,కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రవీంద్రనాథ్,కృష్ణయ్య,తోట వెంకటేశ్వర్లు,కొమ్మ శ్రీహరి గుడిపాటి ప్రసాద్,దండే శ్రీనివాసులు,భవాని వాసు, మిడితా వెంకటేశ్వర్లు,లింగమూర్తి, పల్లె భీమాశంకర్ తదితరులు పాల్గొన్నారు
Arattai