నంద్యాల పురపాలక సంఘ నూతన చైర్‌పర్సన్‌గా డా. పి. బాబన్ ప్రమాణ స్వీకారం
NANDYAL Nov23:- నంద్యాల పురపాలక సంఘ నూతన పాలకవర్గం కొలువుదీరింది. సోమవారం నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు

ఈ కార్యక్రమంలో నంద్యాల పురపాలక సంఘ నూతన చైర్‌పర్సన్‌గా డా. పి. బాబన్ ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శివప్రసాద్ రెడ్డి నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు
ఈ కార్యక్రమానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, శాసనమండలి సభ్యులు ఇసాక్ బాష హాజరయ్యారు

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్వహించారు. ఈ పదవికి 11వ వార్డు సభ్యుడు ఉప్పరి సుబ్రహ్మణ్యం (టీడీపీ), 48వ వార్డు సభ్యురాలు పున్న రాజేశ్వరి (వైఎస్సార్సీపీ) పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఉప్పరి సుబ్రహ్మణ్యంను పి. వెంకట ప్రదీప్ రెడ్డి ప్రతిపాదించగా, తారక రామయ్య బలపరిచారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి పున్న రాజేశ్వరిని షేక్ జాకీర్ హుస్సేన్ ప్రతిపాదించగా, ఎం. లక్ష్మీదేవి బలపరిచారు

అనంతరం నిర్వహించిన చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్‌లో ఉప్పరి సుబ్రహ్మణ్యంకు 28 ఓట్లు, పున్న రాజేశ్వరికి 27 ఓట్లు లభించాయి. దీంతో ఒక ఓటు ఆధిక్యంతో ఉప్పరి సుబ్రహ్మణ్యం నంద్యాల పురపాలక సంఘ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు

నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వార్డు సభ్యులతో పాటు మున్సిపల్ కమిషనర్ శేషన్న, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Arattai