పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు,బార్లు మూసివేయాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
NANDYAL Oct30 :- నంద్యాల జిల్లాలో పట్టణ స్థానిక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా డ్రై డేస్ (Dry Days ) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 20 ప్రకారం ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.
పోలింగ్ సమయంలో
2026 నవంబర్ 1వ తేదీన జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డ్రై డే అమల్లో ఉంటుంది. ఈ నిబంధన నంద్యాల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్ మున్సిపాలిటీల పరిధిలో అమలవుతుంది.
ఓట్ల లెక్కింపు సందర్భంగా:
2026 నవంబర్ 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అదే రోజు అర్ధరాత్రి 12 గంటల వరకు డ్రై డే అమల్లో ఉంటుంది. ఈ నిబంధన బేతంచెర్ల నగర పంచాయతీ పరిధితో పాటు దాని చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో అమలులో ఉంటుంది.(Dry Days ) డ్రై డేస్ సమయంలో సంబంధిత ప్రాంతాల్లో మద్యం విక్రయించే అన్ని దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉత్తర్వులను సంబంధిత లైసెన్సుదారులకు పోలీస్ స్టేషన్ల ద్వారా అందజేసి, అమలును పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
Arattai