నంద్యాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం: కమిషనర్ శేషన్న
NANDYAL Oct 02 :- నంద్యాల మున్సిపాలిటీలో చైర్పర్సన్, కౌన్సిలర్ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శేషన్న తెలిపారు.మున్సిపాలిటీలో మొత్తం 22.49 శాతం ఓట్లు నమోదయ్యాయని, 460 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు.నవంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 78 టేబుళ్లను ఏర్పాటు చేశామని, వీటిలో 26 టేబుళ్లను చైర్పర్సన్ ఓట్ల లెక్కింపునకు, మిగిలిన 52 టేబుళ్లను వార్డుల కౌన్సిలర్ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేటాయించినట్లు వివరించారు.ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం మిగిలిన ఓట్ల లెక్కింపు చేపడతామని కమిషనర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను రాత్రి 8 గంటలకల్లా పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు ఏర్పాట్లు చేశామని కమిషనర్ శేషన్న తెలిపారు.
Arattai