ఏ.కోడూరు అభివృద్ధికి కృషి చేస్తా.:ఎంపీటీసీ అభ్యర్థి మిడుతూరి సౌదామిని
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైయస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి లాలి స్వామి
ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఏ. కోడూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మిడుతూరు సౌదామిని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమెకు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్యదర్శి లాలి స్వామి, మాజీ ఎంపీపీ సంజీవరెడ్డి ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా మిడుతూరు సౌదామిని మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏ. కోడూరు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ, గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లాలి స్వామి, సంజీవరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అభ్యర్థి మిడుతూరు సౌదామినికి మద్దతుగా నిలిచి ఆమె విజయానికి సహకరించాలని ప్రజలను కోరారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి, ఖాదర్, దస్తగిరి, ముట్టు, జావలి మస్తాన్, వెంకటేశ్వర్ రెడ్డి, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
Arattai