కార్తీక సోమవారం సందర్భంగా స్పటిక లింగేశ్వరునికి ప్రత్యేక పూజలు
NANDYAL Nov16 :- నంద్యాలలోని అమ్మ స్పటిక లింగేశ్వరాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలో కొలువుదీరిన స్పటిక లింగేశ్వర స్వామికి వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక అభిషేకాలు,అర్చనలు నిర్వహించారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.కార్తీక మాసం పవిత్రతను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో స్పటిక లింగేశ్వరున్ని దర్శించుకున్నారు
కార్తీక మాసం సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో సోమవారం ఆకాశ దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా స్పటిక లింగేశ్వర స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
Arattai