నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్షులు గా డాక్టర్ పనిల్ కుమార్ ప్రమాణ స్వీకారం
NANDYAL Nov15 :- ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు అధికార పర్యటన, నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్షులుగా డాక్టర్ పనిల్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.

నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజుతో పాటు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ బాల మద్దయ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్షులుగా డాక్టర్ పనిల్ కుమార్ తో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐఎంఎ లో 24 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారని, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ఐఎంఏ సభ్యులు సేవలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 100 బ్రాంచీలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. నంద్యాల ఐఎంఏ రాష్ట్రంలోనే సేవా కార్యక్రమాలలో ప్రథమ స్థానంలో ఉందని ప్రశంసించారు. ప్రభుత్వ వైద్యుల సమస్యలను, ప్రైవేట్ ఆస్పత్రుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం వివిధ సందర్భాల్లో అందజేశామని గుర్తు చేశారు.

ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్షులు డాక్టర్ పనిల్ కుమార్ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ద్వారా ప్రజా ఆరోగ్య అవగాహన సదస్సులు, వైద్య శిబిరాలు తరచూ నిర్వహిస్తామని అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ గత సంవత్సరం డాక్టర్ శ్రీనివాసరావు అధ్యక్షతన అనేక కార్యక్రమాలు నిర్వహించారని ప్రశంసించారు. వైద్యులు వైద్యం అందించడంలో నిర్ణీత ప్రమాణాలు పాటించాలని కోరుతూ, వైద్యులకు, రోగులకు మధ్య సరైన అవగాహనతో కూడిన సత్సంబంధాలు ఉండాలని అన్నారు.

ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ,డాక్టర్ బాల మద్దయ్య,రాష్ట్ర ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి సుబ్బారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు గా గత సంవత్సరం పని చేసిన డాక్టర్ శ్రీనివాసరావులను ఐఎంఏ నంద్యాల సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బాలరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుభాష్ చంద్రబోస్, నంద్యాల ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ బాల మద్దయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి ప్రసాద్,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ విజయభాస్కర రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సౌజన్య,డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత, డాక్టర్ లలిత, డాక్టర్ సునీత లతోపాటు అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.
Arattai