నంద్యాలలో డిసెంబర్ 28, 29 తేదీల్లో జీఎస్టీపై రెండు రోజుల జాతీయ సదస్సు
NANDYAL Nov11 :- నంద్యాల పట్టణంలోని పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ కళాశాల వాణిజ్య విభాగం, న్యూఢిల్లీకి చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సంయుక్త ఆధ్వర్యంలో జీఎస్టీ (GST) అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల డిసెంబర్ 28, 29 తేదీల్లో జరగనున్న ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. శశికళ బుధవారం తన ఛాంబర్లో ఆవిష్కరించారు.

ఈ జాతీయ సదస్సుకు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరుకానున్నారు. జీఎస్టీ విధానం, దాని అమలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉంది.ఈ కార్యక్రమంలో సెమినార్ కన్వీనర్ డా. పి. వెంకటేశ్వర్లు, కో-కన్వీనర్ డా. బి. నాగేంద్ర, అసిస్టెంట్ కన్వీనర్ శోభారాణి, సెక్రటరీ డా. దస్తగిరి, వైస్ ప్రిన్సిపాల్ డా. శైలజారాణి, అధ్యాపకులు వాసవీదేవి, చంద్రరేఖ, శశికళ, రాధారమణి, సరస్వతి, శ్రీనివాసులు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Arattai