అన్నపూర్ణ దేవి అలంకారంలో శ్రీ కాళికాంబ దేవి..
NANDALURU Oct13:- కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబ దేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీ కాళికాంబ అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు.

అన్నపూర్ణ దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.దసరా శరన్నవరాత్రి వేడుకలు ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతుండటంతో నాగిరెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
Arattai