శారద పీఠం పాఠశాలలో ఘనంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు
NANDYAL Nov14 :- నంద్యాల పట్టణంలోని శారద పీఠం పాఠశాలలో నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను లయన్స్ క్లబ్ సభ్యులు అభినందించి, వారి ప్రతిభను గుర్తిస్తూ జ్ఞాపికలను అందజేశారు.

విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని లయన్స్ సభ్యులు ఆకాంక్షించారు.విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లైన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ కార్యదర్శి చంద్రశేఖర్ జోనల్ చైర్మన్ సోమేసుల నాగరాజు, పాఠశాల గౌరవ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు, వసుంధర దేవి,ప్రధానోపాధ్యాయుడు వెంకట కృష్ణుడు,విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Arattai