నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20న మెగా జాబ్ మేళా
NANDYAL Nov16 :- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 20వ తేదీ శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శైలజ రాణి తెలిపారు.కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) సహకారంతో కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (JKC) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు
ఈ జాబ్ మేళాలో MRF, Foxconn, ZF Commercials, AIL Dixon, Premier Energies, Blue Star, Granules India, Green Teck Industry, TCL CSOT, Foxconn, Navatha Transport, Nandi Sujala Pipes తదితర మొత్తం 12 ప్రముఖ కంపెనీలు పాల్గొని 295 ఉద్యోగ ఖాళీలనుభర్తీ చేయనున్నాయి.ప్రస్తుతం తృతీయ సంవత్సరం డిగ్రీ చదువుతున్న కళాశాల విద్యార్థులతో పాటు, నంద్యాల నోడల్ రిసోర్స్ సెంటర్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులు, నంద్యాల పరిసర ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థుల విద్యార్హతలను బట్టి నెలకు రూ.12,000 నుంచి రూ.25,000 వరకు వేతనంతో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా ఉపాధి ,నైపుణ్యాభివృధి అధికారి సోమశివారెడ్డి , జిల్లా నైపుణ్యాభివృధి అధికారి శ్రీకాంత్ రెడ్డి , నోడల్ రిసోర్స్ సెంటర్కోఆర్డినేటర్ డా. వి. రమేష్ కుమార్ తెలిపారు.
Arattai