సకాలంలో వర్షాల కోసం నంద్యాలలో వరుణయాగం.. వరుణ జపం
NANDYAL 06 :- నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవస్థానం నందు రాష్ట్ర దేవదాయ శాఖ సూచనల మేరకు వరుణయాగం,వరుణ జపం నిర్వహించినట్లు దేవస్థానం చైర్మన్ అనిల్ కుమార్ తెలిపారు.సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు,రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించినట్లు ఆయన తెలిపారు.దేవస్థాన కార్యనిర్వాహక అధికారి వేణునాధ రెడ్డి,వేద పండితులు కార్తికేయ శర్మ పాల్గొన్నారు
Arattai