నంద్యాల బృందావన గోశాలకు లయన్స్ క్లబ్ సహకారం
NANDYAL Oct05 :-నంద్యాల పట్టణం, SBI కాలనీలోని బృందావన గోశాలకు నంద్యాల లయన్స్ క్లబ్ సహకారంతో ఫ్యాన్లు,లైట్లు అందజేశారు.గోవుల సంరక్షణ కోసం బసవరాజు చేస్తున్న సేవలు అభినందనీయమని క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్,చంద్రశేఖర్ లు తెలిపారు.గోవుల సంరక్షణకు తమ వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు,భవిష్యత్తులోనూ గోశాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజాసేవలో భాగంగా జంతు సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని వారు పిలుపునిచ్చారు. గోశాలలు, మూగజీవుల సంరక్షణ కేంద్రాలకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంఘాలు అండగా నిలిస్తే వాటి నిర్వహణ మరింత మెరుగుపడి, మూగజీవులకు మెరుగైన సంరక్షణ అందుతుందని పేర్కొన్నారు. సమాజహితం కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
Arattai