బనగానపల్లిలో రేనాటి సీమ ఐఎంఏ నూతన శాఖ ప్రారంభం
NANDYAL Nov15 :- బనగానపల్లిలో రేనాటి సీమ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నూతన శాఖను శనివారం ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బాలరాజు, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. చిన్న శాఖ అయినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో వైద్యులు హాజరుకావడం అభినందనీయమని పేర్కొన్నారు. వైద్యుల ఐక్యత, సమన్వయంతో వైద్య సేవలను మరింత విస్తృతం చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బనగానపల్లి ఐఎంఏ నూతన అధ్యక్షురాలు డాక్టర్ సుజాత, కార్యదర్శి డాక్టర్ శరత్ చంద్రారెడ్డి తో పాటు బనగానపల్లికి చెందిన పలువురు వైద్యులు పాల్గొన్నారు.
Arattai