నంద్యాల ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానంలో అన్న ప్రసాద వితరణ
NANDYAL Nov13:- నంద్యాల పట్టణంలోని శ్రీ ప్రధమ నందీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మార్వో శ్రీనివాసులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ చలం బాబు మాట్లాడుతూ.. గత ఆరు సంవత్సరాలుగా భక్తులు, దాతల సహకారంతో నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు ప్రతిరోజూ భక్తులకు అన్న ప్రసాద వితరణ కొనసాగిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సబ్యులు భక్తులు పాల్గొన్నారు.
Arattai