అయ్యప్ప స్వామి భక్తులకు రైల్వే శాఖ శుభవార్త : ఎం పి డాక్టర్ బైరెడ్డి శబరి
NANDYAL Nov12 :- శబరిమలకు వెళ్ళే అయ్యప్ప స్వామి మాలధారణ దీక్ష భక్తుల కొరకు నంద్యాల మీదుగా కొల్లం కి స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు దక్షిణ మధ్య రైల్వే శాఖ నడుపుతున్నట్లు నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి గురువారం తెలిపారు.
ట్రైన్ నెంబర్ 07231 కాకినాడ నుండి కొల్లంకి నంద్యాల మీదుగా 19-11-26 నుండి 21-01-27 వరకు మొత్తం 10 ట్రిప్పులు. కాకినాడలో ప్రతి గురువారం ఉదయం 8:30 కు బయలుదేరి నంద్యాలకు సాయంత్రం 6:40 కి చేరుకొని డోన్, ధర్మవరం, మదనపల్లె, కాట్పడి మీదుగా కొల్లంకి మరుసటి రోజు రాత్రి 9;30 కు చేరుకుంటుందని.
ట్రైన్ నెంబర్ 07232 కొల్లం నుండి కాకినాడకు ప్రతి శనివారం ఉదయం 2:30 కు బయలు దేరి నంద్యాలకు ఆదివారం ఉదయం 5:45 కు చేరుకొని కాకినాడుకు బయలుదేరుతుందని, ఈ రైలు కూడా 21-11-26 నుండి 23-1-27 వరకు మొత్తం 10 ట్రిప్పులు తిరుగుతుందన్నారు. ఈ రైలును నంద్యాల జిల్లాలోని రైలు ప్రయాణికులు, అయ్యప్ప మాలధారణ దీక్ష స్వామి భక్తుల వినియోగించాలని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు తెలిపారు.
Arattai