చెస్ టోర్నమెంట్ లో నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ద్వితీయ స్థానం
NANDYAL Nov11 :- రాయలసీమ యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల చెస్ టోర్నమెంట్లో నంద్యాలలోని పీఎస్సీ అండ్ కేవీఎస్సీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఈ నెల 10వ తేదీన ఐఏఎస్సీ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన రాయలసీమ యూనివర్సిటీ స్థాయి అంతర్ కళాశాలల చెస్ పోటీల్లో కళాశాలకు చెందిన విద్యార్థినులు పాల్గొని అద్భుత ప్రతిభ ప్రదర్శించారు.

కళాశాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండో స్థానాన్ని సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. శశికళ విజేతలైన హేమలత, మానస, పూజిత, ప్రమీల, పుష్పలను అభినందించారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థినులను ప్రశంసించారు.అలాగే విద్యార్థినులకు క్రమం తప్పకుండా శిక్షణ అందించి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కళాశాల వ్యాయామ ఉపాధ్యాయుడు కే. శ్రీనివాసులును అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.జె. శైలజా రాణి, డాక్టర్ వై. దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
Arattai