భాద్రపద పౌర్ణమి సందర్భంగా స్ఫటిక లింగేశ్వరాలయంలో శాంతి హోమాలు
NANDYAL Sep26 :- నంద్యాల పట్టణంలోని స్ఫటిక లింగేశ్వరాలయంలో శనివారం భాద్రపద మాస పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించారు. నిర్వాహకులు యోగానంద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం స్ఫటిక లింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.అనంతరం యోగా గురువు శ్రీ అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. లోక కళ్యాణార్థం శాంతిహోమాలు నిర్వహించి పూర్ణాహుతి గావించారు.

అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిమ్మయ్య, అనిల్,వెంకటేశ్వర్ రెడ్డి, రఘునాథ రెడ్డి శ్రీనివాసరెడ్డి యోగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Arattai