జిల్లా స్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం
ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు,యువత ఆత్మవిశ్వాసంతో, బలమైన సంకల్పంతో, అంకితభావంతో, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణ తో నిరంతర కృషి చేయడం ద్వారా ఏ రంగంలోనైనా విజయాలు సాధించవచ్చని అన్నారు.

NANDYAL Nov 23:- నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో, ఎన్. ఆర్ . జి. చెస్ అకాడమీ నిర్వహణలో దేవ నగర్ లోని రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు నిర్వహించిన నంద్యాల జిల్లా స్థాయి 4 వ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ లో విజేతలకు నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రాహుల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ సుబ్బయ్య,నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రెటరీ రామ సుబ్బారెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు వెంకటన్న, యోగ శిక్షకులు పుల్లయ్య లు ట్రోఫీలు,పతకాలు ప్రదానం చేశారు.

బాలుర విభాగంలో వివిధ కేటగిరీలలో మొదటి స్థానం సాధించిన క్రీడాకారులు: చార్విక్ నందన్,
ధనిష్ రాయల్, ద్రువీత్, అబ్దుల్ ఆఫ్నాన్, షాహుల్ అమీన్, సోహాన్,బాలికల విభాగంలో
షన్విత,లీలా అక్షర, లక్ష్మీ గీతిక,శాలిని,
తపస్య. పతకాలు సాధించారు
Arattai