నాగిరెడ్డిపల్లిలో శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ కాళికాంబ అమ్మవారు
NANDALURU Oct 17 :- నందలూరు: కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబ దేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ కాళికాంబ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

మహాలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.శరన్నవరాత్రి ఉత్సవాలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Arattai