నంద్యాలలో ఘనంగ శ్రీ కాళికాంబ దేవికి మాలా నక్షత్ర పూజలు
NANDYAL:- : దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా నంద్యాల పట్టణంలోని శ్రీ కాళీకాంబ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం మాలా నక్షత్ర పూజలను ఘనంగా నిర్వహించారు.శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రత్యేక పూజల్లో భాగంగా నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు దేవస్థాన కమిటీ సభ్యురాలు వసుంధరదేవి తెలిపారు.

జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం కమిటీ సభ్యులు తెలిపారు.
Arattai