12 వార్డ్ టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ గఫార్,మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్ లను అఖండ మెజారిటీతో గెలిపించండి
NANDYAL Oct30 :-నంద్యాల మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని ఫరూక్ నగర్లో గురువారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ 12వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ గఫార్ను, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్ ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మున్సిపాలిటీలోని మిగతా 52 వార్డుల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థులందరినీ భారీ ఆధిక్యంతో గెలిపించాలని ఆయన ఓటర్లకు, పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజల మౌలిక వసతుల కల్పన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి ఫరూక్ తెలిపారు .ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందించే నాయకులను చట్టసభలకు, స్థానిక సంస్థలకు ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. కూటమి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ప్రజల ఆశీస్సులు పొందాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు
ఈ సమావేశంలో ఎన్ఎండి ఫయాజ్ , ఎన్ఎండి ఫిరోజ్, చైర్మన్ నారాయణస్వామి, డైరెక్టర్లు మునియార్ ఖలీల్, తులసి రెడ్డి, ఉప్పరి సురేష్ కుమార్, కొట్టాల శివ నాగిరెడ్డి, బెండకాయల ఇస్మాయిల్, ఉప్పరి సుబ్రహ్మణ్యం (సుబ్రీ) మరియు స్థానిక వార్డు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Arattai