కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
NANDYAL Oct05 :- గురువారం నంద్యాల పట్టణం,శ్రీనివాస్ నగర్ రైతు బజార్ సమీపంలో కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది.ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మురళీకృష్ణ,ప్రముఖ ఇన్ ఫర్టిలిటీ, గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ తనూజ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆసుపత్రిని ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, లయన్స్ సేవా సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ నాయకులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ తనూజ మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో గుండె జబ్బులకు సంబంధించిన వైద్యానికి అవసరమైన అత్యాధునిక పరికరాలు, వసతులతో ఏర్పాటు చేశామని, గుండె జబ్బుల ఐసీయూ, క్యాత్ ల్యాబ్ సౌకర్యం ద్వారా యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టి, గుండె బైపాస్ ఆపరేషన్లు చేయడానికి ఆస్కారం ఉంటుందని, నంద్యాల జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో అందించాలన్నదే తమ ఆశయమని తెలిపారు.తనూజ ఫెర్టిలిటీ సెంటర్ లో సంతాన లేమి తో బాధపడే వారికి ప్రత్యేక చికిత్స, స్త్రీ వ్యాధి చికిత్సలు, ప్రసూతి వైద్య వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవతో పాటు ఈ హెచ్ ఎస్ మరియు అన్ని రకాల ఇన్సూరెన్స్ సౌకర్యాలను కూడా కల్పిస్తున్నామని తెలిపారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ కార్డియాలజిస్ట్ గా ఈ ప్రాంతంలో సుపరిచితుడైన డాక్టర్ మురళీకృష్ణ ఈ ఆసుపత్రి ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ ఆస్పత్రి ద్వారా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. నంద్యాల జిల్లా ప్రజలు ఈ ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను వినియోగించుకోవాలని అన్నారు.డాక్టర్ రవి కృష్ణ, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫరుల్లా, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ పనిల్ కుమార్, మహిళా విభాగం నాయకులు డాక్టర్ శైలజ,డాక్టర్ లలిత, డాక్టర్ షబ్నం, న్యూరాలజిస్ట్ డాక్టర్ జయకృష్ణ, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ నిత్యా జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుడైన డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ తనూజ లను లయన్స్ క్లబ్ అధ్యక్షులు సందీప్ ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సోమశేఖర రెడ్డి, డాక్టర్ సౌజన్య, డాక్టర్ హరిత, డాక్టర్ సాయి కృష్ణ,లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ నిజాముద్దీన్, జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు, ఉపాధ్యక్షులు కూరా ప్రసాద్, కార్యదర్శి మేడా చంద్రశేఖర్, కన్నయ్య, కర్నూలు డిప్యూటీ తహసిల్దార్ చంద్రకళ, సత్యవీడు సబ్ ట్రెజరీ ఆఫీసర్ రవి కుమార్, అధిక సంఖ్యలో నంద్యాల ప్రాంత వైద్యులు పాల్గొన్నారు.
Arattai