నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తాను: డాక్టర్ బాబన్
NANDYAL Oct30 :- నవంబర్ ఒకటవ తేదీన జరగనున్న పురపాలక ఎన్నికలలో చైర్మన్ పదవికి కూటమి తరపున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బాబన్ కు మద్దతు గా గురువారం రాత్రి స్థానిక ఫంక్షన్ హాల్ లో నంద్యాల వైద్యుల కుటుంబాల తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐ.ఎమ్.ఎ. రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఐ.ఎమ్.ఎ కేంద్ర కమిటీ సభ్యులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్, తెలుగు దేశం పార్టీ పురపాలక చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్ ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగించారు.

నంద్యాల ఆంజనేయ స్వామి ఆలయం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ మహమూద్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో మంత్రి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం కూటమి తరుపున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బాబన్ ను, 52 వార్డులలో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీ గెలిపించాలని పిలుపునిచ్చారు. తాను నంద్యాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని,ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్నదని,పేదల జీవితాలలో వెలుగులు నింపాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.

డాక్టర్ బాబన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం అంకితభావంతో కృషి చేస్తానని ప్రకటించారు.మంత్రి ఫరూక్ సహకారంతో పట్టణ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు.డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రి ఫరూక్ ల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు కూటమి అభ్యర్థులను విజయ పథంలో నడిపిస్తాయని అన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి, ప్రొద్దుటూరు శాసనసభ పార్టీ పరిశీలకులు ఏవిఆర్ ప్రసాద్, సీనియర్ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు,ఆంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, ఐ.ఎమ్.ఎ. రాష్ట్ర కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ వైద్యులు కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Arattai