లయన్స్ సేవా సంస్థ,ఐ ఎమ్ ఏ ఆధ్వర్యంలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధక వాక్సిన్ కార్యక్రమం.
NANDYAL :- నంద్యాల లయన్స్ క్లబ్,నంద్యాల ఐ.ఎమ్.ఏ. మహిళా వైద్యుల విభాగం ఆధ్వర్యంలో మంగళ వారం, మధు చిన్న పిల్లల ఆసుపత్రి నిర్వహణ లో , ఆసుపత్రి ప్రాంగణంలో బాలికలు,మహిళలకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధక వాక్సిన్ కార్యక్రమం నిర్వహించారు

లయన్స్ క్లబ్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ఐ.ఎమ్.ఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ సేవా సంస్థ జిల్లా గవర్నర్ విరూపాక్ష రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని 100 వ్యాక్సిన్ డోసులు మహిళా వైద్యుల విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్య దర్శి డాక్టర్ సునీత, గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నర్మద, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వసుధ లకు అంద చేశారు.

ఈ సందర్భంగా విరూపాక్ష రెడ్డి, డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐ.ఎమ్.ఏ. మహిళా వైద్యుల ఆర్ధిక సహకారంతో, అంతర్జాతీయ లయన్స్ సంస్థ మ్యాచింగ్ నిధులతో సీరం ఇండియా, పూణే సంస్థ నుండి రాయితీ తో కొనుగోలు చేసిన హెచ్.పి.వి.వాక్సిన్ లు వంద డోసులు అంద చేశామని, తదుపరి రెండవ, మూడవ డోసులు ఇచ్చే సమయంలో వాటికి తగినన్ని వాక్సిన్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

డాక్టర్ మాధవి మాట్లాడతూ 9 నుండి 15 సంవత్సరాల వయసు లో ఉన్న బాలికలకు మూడు డోసులు,15 నుంచి 25 సంవత్సరాల మహిళ లకు రెండు డోసులు వాక్సిన్ ఇవ్వడం ద్వారా మహిళకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ భవిష్యత్ లో రాకుండా నిరోధించ వచ్చని అన్నారు. నంద్యాల మహిళా వైద్యుల విభాగం ద్వారా విడతల వారీగా వీలైనంత మంది బాలికలకు ఈ వాక్సిన్ ను లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ మ్యాచింగ్ నిధులతో ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ సేవా సంస్థ ఆంధ్ర ప్రదేశ్ మాజీ చైర్మన్ ఎ.వి.ఆర్.ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ నంద్యాల మహిళా వైద్యుల విభాగం సేవలు ప్రశంసనీయమని అభినందించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సందీప్,మేడా చంద్రశేఖర్, కోశాధికారి సురేష్, రీజియన్ చైర్మన్ నిజాముద్దీన్,జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు,జిల్లా లయన్స్ క్యాబినెట్ కార్యదర్శి హనుమేష్ రెడ్డి, జిల్లా లయన్స్ జిల్లా చైర్మన్ శ్రీనివాసులు, సీనియర్ సభ్యులు ఆంజనేయులు గుప్తా, గోళ్ళ సుదర్శనం,మామిళ్ళ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Arattai