నంద్యాల 5వ వార్డులో టీడీపీ అభ్యర్థి చందా పద్మశేఖర్ విస్తృత ప్రచారం
NANDYAL Oct 28:- నంద్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 5వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చందా పద్మశేఖర్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, సురేష్ రెడ్డి పాల్గొని అభ్యర్థితో కలిసి ప్రజలను కలిశారు

ఈ సందర్భంగా చందా పద్మశేఖర్ మాట్లాడుతూ, 5వ వార్డు ప్రజలు తనకు అవకాశం కల్పించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చందా పద్మశేఖర్ తెలిపారు.

ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికులను కలుసుకుంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.
Arattai