స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు అబ్జర్వర్ల నియామకం : జిల్లా కలెక్టర్ రాజకుమారి
NANDYAL Oct18 :- నంద్యాల జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణకు జనరల్ అబ్జర్వర్‌గా జె. వెంకట మురళి, ఐఏఎస్, ఎన్నికల వ్యయ పరిశీలకురాలిగా పి. శ్యామల, ఐఎఫ్ఎస్ నియమితులైనట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి గణియా తెలిపారు.ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణను జనరల్ అబ్జర్వర్ పర్యవేక్షిస్తారని, అభ్యర్థుల ఎన్నికల వ్యయాలు, నిర్దేశిత పరిమితులు, వ్యయ రికార్డుల పరిశీలనను ఎన్నికల వ్యయ పరిశీలకురాలు పర్యవేక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.జనరల్ అబ్జర్వర్ జె. వెంకట మురళి, ఐఏఎస్ – 7815959526, ఎన్నికల వ్యయ పరిశీలకురాలు పి. శ్యామల, ఐఎఫ్ఎస్ – 9440810075
Arattai