నంద్యాల విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు
NANDYAL Oct18 :- నంద్యాల పట్టణంలోని జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయం నందు దుర్గాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు పట్టణ అధ్యక్షురాలు సుహాసిని తెలిపారు.ఈ సందర్భంగా మాతృ శక్తి- దుర్గా వాహిని ఆధ్వర్యంలో కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

ఆడపిల్లల ఆత్మరక్షణ,శక్తి సామర్థ్యాలు ధైర్య సాహసాలు ఈ అంశాలపై ఆడపిల్లలకు అవగాహన కల్పించినట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ లలితా సరస్వతి, నరాల అరుణ, దేవి, కృష్ణవేణి, సాహితీ దుర్గ, శరణ్య, లతా తదితర కార్యకర్తలు పాల్గొన్నారు
Arattai