నాగిరెడ్డిపల్లిలో వైభవంగా దసరా ఉత్సవాలు
NANDYAL Oct20:- కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబదేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దసరా ఉత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు.శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాళికాంబదేవి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి భక్తులను కటాక్షించారు.

వివిధ అలంకారాలతో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తిగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Arattai