నంద్యాలలో శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
NANDYAL Oct13 :- నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు

ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీదేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. అమ్మవారి అలంకరణ కోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
అమ్మవారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కళ్యాణ మండపంలో భక్తి వాతావరణం నెలకొంది.ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.కూర మురళి క్రిష్ణ ప్రసాద్ ధర్మపత్ని ప్రీతి,ప్రసాద్ ట్రేడింగ్ కో అలంకారానికి సహకరించినట్లు దేవస్థానం అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి తెలిపారు.బాలాజీ మర్చంట్స్ కమిటీ కల్యాణ మండప దేవస్థానం పాలకవర్గం మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
Arattai