చండీ దేవి అలంకారంలో శ్రీ కాళికాంబ అమ్మవారు
NANDYAL Oct14 :- నంద్యాల పట్టణం,కోట వీధిలోని శ్రీ కాళికాంబ చంద్రశేఖర దేవస్థానం నందు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు బుధవారం అమ్మవారు చండీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.అమ్మవారికి చీరలతో ప్రత్యేక అలంకరణ చేశారు.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ,ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని దేవస్థాన కమిటీ సభ్యురాలు వసుంధరా దేవి తెలిపారు.ప్రతిరోజు ప్రసాద వితరణ చేస్తున్నట్లు తెలిపారు
Arattai