బాల త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు
NANDALURU :- కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలోని శ్రీ కాళికాంబ దేవి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఆదివారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆదివారం అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజించడం ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భక్తిభావం వెల్లివిరిసింది. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.
Arattai