ఆడపిల్లలను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం: జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ అధికారిడాక్టర్ శారదా బాయి.
NANDYAL Oct 11 :- అంతర్జాతీయ బాలికల దినోత్సవ సందర్భంగా ఈరోజు వైద్య సిబ్బంది, ఆర్ ఆర్ నర్సింగ్ విద్యార్థులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారదాబాయి సమావేశం ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ ఆడపిల్లలను బ్రతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం
బాలికల హక్కులలో పెట్టుబడులు పెడదాం,మగ బిడ్డ ఆడ బిడ్డని తేడా లేకుండా ప్రజలను చైతన్య పరిచే బాధ్యత వైద్య సిబ్బంది మీద ఉంది అన్నారు
బాలికలకు వారి హక్కుల గురించి వారి చట్టాల గురించి ఆరోగ్య విద్య అందించాలన్నారు.ఆడబిడ్డ సమాజానికి ఎంతో అవసరమని అటువంటి ఆడబిడ్డను సమానంగా తల్లిదండ్రులు చూడాలని ఉన్నత చదువులు చదివించాలని కోరారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఆడపిల్లను బతకనిద్దాం అనే నినాదం మీద ఫిలిం షో కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని మొదటి బహుమతి ద్వితీయ బహుమతి తృతీయ బహుమతి విద్యార్థుల టీములకు రేపు పిజిఆర్ఎస్ భవనంలో గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ రాజకుమారి గనియ గారి చేతుల మీదుగా బహుమతులు విద్యార్థులకు అందజేస్తారని డిఎంహె ఓ డాక్టర్ శారదా బాయి తెలిపారు

ఆడబిడ్డలకు చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల కుటుంబాన్ని అర్థం చేసుకోలేక కాన్పు సమయంలో కష్టాలు పడుతూ సంసార బాధ్యతలు తెలియకపోవడంఆమె నిర్ణయంయం తీసుకోలేకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుందని వాటిని పెంపొందించవలసిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు ఆడపిల్ల లేదా మగ బిడ్డ అని స్కానింగ్ సెంటర్ లోకి వెళ్లి అడగకూడద నీ, అడిగినటువంటి వారికి లింగ నిర్ధారణ చెప్పిన వైద్యులకు పిసిపి ఎన్డిటి 1994 చట్ట ప్రకారం శిక్షార్హులవుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డాక్టర్ ఓ లలిత. సూపరిండెంట్ డాక్టర్ చిట్టిబాబు
ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ జగదీశ్ చంద్రారెడ్డి డాక్టర్ కాంతారావు నాయక్ డెమో మల్లేపల్లి పామన్న వైద్యులు ఆర్ఆర్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Arattai