నంద్యాలలో జిల్లాస్థాయి ర్యాంకింగ్ చెస్ పోటీలు ప్రారంభం
NANDYAL Oct06 :- నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఎన్ ఆర్ జి చెస్ అకాడమీ నిర్వహణలో శుక్రవారం నంద్యాల హనీఫ్ నగర్ లో ఉన్న రోటరీ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు, పాఠశాల కరస్పాండెంట్ సుబ్బయ్య సహకారంతో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి మూడవ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్ నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ రవి కృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి, సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి చదువుతోపాటు కళలు,క్రీడలు దోహదం చేస్తాయని అన్నారు. చదరంగం మేధో శక్తిని పదును పెడుతుందని అన్నారు.

ప్రస్తుతం కృత్రిమ మేధ పై ఎక్కువగా ఆధార పడే పరిస్థితికి వస్తున్నదని, ఈ నేపథ్యంలో బాలలలో ఆలోచనా శక్తిని,విశ్లేషణ నైపుణ్యాన్ని పెంచడానికి సరైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కృత్రిమ మేధ అవసరమైనంత మేరకు వినియోగించుకోవాలని, ఎక్కువగా ఆధారపడకుండా ఉండడం అవసరమన్నారు. ఈ విషయంపై ఐఎంఏ, కళారాధన, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేధావులు, విద్యావేత్తలు, విద్యాసంస్థల ప్రతినిధులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తల్లిదండ్రులతో చర్చా వేదిక నిర్వహించి తగిన సూచనలను ప్రభుత్వానికి అందివ్వడం జరుగుతుందన్నారు.

జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బా రెడ్డి మాట్లాడుతూ ఈ పోటీలు 12 వివిధ వయసు విభాగాల్లో వేరు వేరుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.ఈ పోటీల లో ప్రతిభ కనబరిచిన వారికి ఒక్కొక్క క్యాటగిరి లో 10 ప్రైజ్ ల చొప్పున మొత్తం 120 ప్రైజ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు. మొత్తం ఐదు జిల్లా స్థాయి ర్యాంకింగ్ టోర్నమెంట్లు నిర్వహించి ప్రతిభను గుర్తించి రాష్ట్రస్థాయిలో వారికి ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి హనీఫ్ నగర్ రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ సుష్మ, క్యాంపస్ ఇంచార్జ్ నస్రీన్, చీఫ్ ఆర్బిటర్ సుజాత,టోర్నమెంట్ ఆర్గనైజర్ అరుణ్ కుమార్, నిర్వాహకులు శాంతినికేతన్ సురేష్,మాధవి, రమ్య, కోచ్ సురేష్ కుమార్ చెస్ క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Arattai