పుర పాలక ఎన్నికల లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: డాక్టర్ రవి కృష్ణ
NANDYAL Oct24 :- నంద్యాల పురపాలక చైర్మన్ పదవికి కూటమి తరపున పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బాబన్ నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం,కళారాధన,వివిధ స్వచ్ఛంద సంస్థల కేంద్ర కార్యాలయానికి ప్రచారం లో భాగంగా రావడం జరిగింది.
డాక్టర్ బాబన్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ అభివృద్ధి కోసం పెద్దలు,మేధావుల సలహాలతో కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు,అంతర్జాతీయ లయన్స్ సంస్థ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్,నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం,నంద్యాల జిల్లా చిన్న,వీధి వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు,కళారాధన వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ఈ సందర్భంగా డాక్టర్ బాబన్ ను సత్కరించారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బాబన్ తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు.కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్,తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, మంత్రి ఫరూక్ ల నేతృత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులు కూటమి అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి.రమణయ్య, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి,సినీ,టీవీ, నాటక రంగ నటులు ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ సోమేశుల నాగరాజు,కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి,పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు రామయ్య , దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు వెంకటరావు,రంగస్వామి,తెలుగు దేశం పార్టీ నాయకులు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
Arattai