మున్సిపల్ ఎన్నికల బరిలో సీనియర్ పాత్రికేయుడు కుటుంబం
NANDYAL Oct23 :- నంద్యాల అంటేనే సంచలనం,చరిత్ర సృష్టించడంలో పేరొందింది.రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి,వైసీపీ,కాంగ్రెస్,స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉండడం సహజం.నంద్యాలలో సంచలనం సృష్టించే విధంగా మరోసారి చరిత్ర సృష్టించింది.పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఎన్నికల్లో భార్య ,భర్తలు నిలబడి ఔరా అనిపిస్తున్నారు.పాత్రికేయ వృత్తిలో 30 ఏళ్ళుగా వివిధ ప్రధాన పత్రికల్లో పని చేసి ఎన్నో సంచనల వార్తలు ప్రజలవద్దకు తీసుకొని వెళ్లి పాత్రికేయ వృత్తికి న్యాయం చేశారు.

ప్రభుత్వానికి,ప్రజలకు వారధిగా ఉంటూ అందరికీ సుపరిచితుడు అయ్యారు.పాత్రికేయ వృత్తితో పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ పాత్రికేయులకు అండగా ఉంటున్నారు. ప్రస్తుతం మధుబాబు నంద్యాల జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. జిల్లాలో పాత్రికేయుల సమస్యలపై గళం విప్పడంలో సూర్య మధు ముందు వరసలో ఉంటారు. ప్రజా సమస్యలు,ప్రశ్నించే మస్తత్వం ఉండడంతో ప్రజలకు మరింత సేవచేయడానికి ఆ కుటుంబం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం.పాత్రికేయ అనుభవాన్ని ప్రజా సేవకు ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో మున్సిపల్ చైర్మెన్ అభ్యర్థిగా సీనియర్ పాత్రికేయులు సూర్య మధు సతీమణి పి. రాధ బరిలో నిలిచారు.

అలాగే సీనియర్ పాత్రికేయులు సూర్య మధు సైతం 28 వార్డ్ కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి ఉన్నారు. వివరాల్లోకి వెళితే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ,వైసీపీ పార్టీలు చైర్మెన్ అభ్యర్థులు ప్రకటించడంలో అందరిని టెన్షన్ లో పెట్టారు.రిజర్వేషన్ లో రెండు పార్టీలు డాక్టర్ బాబన్,దాల్ మిల్ అమీర్ ను ప్రకటించడం విదితమే.కొన్ని సామాజిక వర్గాలు గుర్తుగా ఉండడం, సీనియర్ నాయకులు సైతం దూరంగా ఉండడం తెలిసిందే.ఈ నేపధ్యంలో నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో 52 వార్డుల్లో మొత్తం ఓటర్లు 1,99,238 ఓటర్లు ఉండగా ఎస్టీలు 3238,ఎస్సీలు 28,234,బీసీలు 1,14,072 ఇతరులు 53,703 ఓటర్లు,మరో కోటా ఓటర్లు 79 ఉన్నారు.ప్రస్తుతం మహిళా చైర్మెన్ అభ్యర్థి పి.రాధ బరిలో నిలిచారు.ఎన్నికలు రోజుకో మలుపులు తిరగడంతో రేపటి నుంచి ప్రచారాలు ముమ్మరం చేస్తామని పేర్కొన్నారు.పట్టణంలో మంచిపేరు ఉన్న సూర్య మధు అభివృద్ధి చేసి నిరూపిస్తానని ఒక్క చాన్స్ మా కుటుంబానికి ఇవ్వాలని కోరుతున్నారు.ప్రభుత్వాలు మహిళలకే ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పుకొస్తున్నారు .ప్రభుత్వ గతంలో మాదిరి కాకుండా చైర్మెన్ ను డైరెక్ట్ గా ప్రజలు ఎన్నుకునే విధానం చేయడంతో రాజకీయ వత్తిళ్లకు తలొగ్గక పి రాధ చైర్మెన్ అభ్యర్థి గా ఉండడం పలువురు ప్రశంసిస్తున్నారు.రెండు పార్టీలు సైతం మహిళా అభ్యర్థి పోటీలో నిలబడడం జీర్ణించుకోలేకపోతున్నారు.చైర్మెన్ అభ్యర్థిగా నిలబడిన పి. రాధ కు మహిళలు వారి అమూల్యమైన ఓటు వేసి మహిళా శక్తిని నిరూపిస్తారని ఆశిద్దాం. ఎన్నికల అధికారులు అధికారికంగా ఈ నెల 25న చైర్మెన్ తో పాటు ఆ వార్డులో పోటి లో నిలిచినా జాబితాను విడుదల చేయనున్నారు. జాబితే విడుదల అయిన వెంటనే భారీ స్థాయిలో ప్రచారంలో అడుగుపెట్టేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు సూర్య మధు అంతరంగీకుల నుంచి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రచార పత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలం సృష్టిస్తున్నాయి. చైర్మెన్ అభ్యర్థిగా ఒక ఎన్నికల అజెండాను రూపొందించినట్లు ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతుంది. ఎన్నికల అధికారులు ఇద్దరికీ కుండ గుర్తును కేటాయించడం మరో విశేషం.
Arattai