YSRCP కీలక నేత సురేష్ పాల్ టిడిపిలో చేరిక
NANDYAL Oct24 :- నంద్యాల పట్టణంలో తెలుగుదేశం పార్టీకి ప్రజా మద్దతు వెల్లువెత్తుతోంది. టిడిపి రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, 17వ వార్డు టిడిపి ఇంచార్జి గోసుల నాగేశ్వరరావు, ఎబినేజర్ , మాజీ కౌన్సిలర్లు మిద్దె ఉసేని, శివ శంకర్ యాదవ్ , దేవనగర్ దిలీప్, అజ్మీర్ ఆధ్వర్యంలో నంద్యాల టౌన్ 17వ వార్డు గోపాల్ నగర్‌కు చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సురేష్ పాల్ తన 100 మంది ప్రధాన అనుచరులతో కలిసి శనివారం నంద్యాలలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, ఎన్ఎండి ఫిరోజ్ ల సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం ఘనంగా జరిగింది. పార్టీలో చేరిన సురేష్ పాల్ మరియు వారి అనుచరులకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. నంద్యాల నియోజకవర్గ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకు సముచిత గౌరవం, గుర్తింపు ఉంటాయని భరోసా ఇచ్చారు

పార్టీలో చేరిన సురేష్ పాల్ మాట్లాడుతూ మంత్రి ఫరూక్ నాయకత్వంపై, తెలుగుదేశం పార్టీ విధానాలపై నమ్మకంతోనే తామంతా టీడీపీలో చేరామని, వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు .

Arattai