నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
NANDYAL Oct 09 :- నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో LCOI Weeks of Service – “VISION” కార్యక్రమంలో భాగంగా రెండో రోజు కూడా చిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షుడు సందీప్ తెలిపారు.కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు

ఈ కార్యక్రమంలో శరదా విద్య పీఠం పాఠశాల నందు మొత్తం 270 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 40 మందికి కళ్లద్దాలు అవసరమని, మరో 50 మంది విద్యార్థులకు కంటి ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చుక్కల మందులు అవసరమని గుర్తించారు. విద్యార్థులకు కంటి సంరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్బంగా అధ్యక్షులు సందీప్ మాట్లాడుతూ చిన్నారుల్లో కంటి సమస్యలను ముందుగానే గుర్తించి, వారి భవిష్యత్తుకు మెరుగైన చూపును అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ నాగరాజు,జనార్దన్, కిరాణలాల్,లయన్స్ క్లబ్ అఫ్ సేవప్రగతి సీనియర్ సభ్యులు శ్రీకాంత్ మరియు సభ్యులు పాల్గొన్నారు.
Arattai