రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నంద్యాల విద్యార్థిని రాగ చైత్రకు ప్రథమ బహుమతి
NANDYAL Oct 09 :- మంగళగిరి,చిన్న కాకాని లో జరిగిన సేవా సంకల్ప్ అభియాన్ రాష్ట్రస్థాయి చిత్రలేఖనం పోటీల్లో నంద్యాల పట్టణంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న విద్యార్థిని రాగ చైత్ర మొదటి బహుమతి సాధించింది

ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్న విద్యార్థుల్లో రాగ చైత్ర తన చిత్రలేఖన నైపుణ్యంతో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె సమర్పించిన చిత్రం న్యాయనిర్ణేతలను ఆకట్టుకోవడంతో మొదటి స్థానం సాధించింది.

శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమిన్ అన్సారియా రాగ చైత్రకు రూ.25 వేల నగదు,ప్రశంసా పత్రాన్ని అందజేశారు. చిన్న వయసులోనే చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన రాగ చైత్ర కు జిల్లా ప్రముఖులు,పలువురు అభినందించారు
Arattai