ఫారం 6,7,8 దరఖాస్తుల నిర్వహణపై ఈఆర్ఓలకు రోల్ అబ్జర్వర్ ప్రశాంతి సూచనలు
DHONE Oct 09 :-ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల పరిశీలన, రికార్డుల నిర్వహణలో నిబంధనలు పక్కాగా పాటించాలని రోల్ అబ్జర్వర్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ డైరెక్టర్ ప్రశాంతి సంబంధిత ఎన్నికల అధికారులకు సూచించారు. శుక్రవారం ఆమె డోన్ నియోజకవర్గంలో పర్యటించి, ఓటర్ల జాబితాకు సంబంధించి ఫారం-6, ఫారం-7, ఫారం-8 ద్వారా అందిన దరఖాస్తులను, వాటికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువీకరించారు.

ఈ సందర్భంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి నిర్వహణ, పరిశీలన ప్రక్రియలో పాటించాల్సిన విధానాలను సమీక్షించారు. రికార్డుల నిర్వహణలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు సంబంధిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ఈఆర్ఓలు) తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, అవసరమైన ఆధారాలతో రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని స్పష్టం చేశారు. డోన్ ఆర్డీఓ నరసింహులు, సంబంధిత ఏఈఆర్ఓలు, తదితరులు పాల్గొన్నారు
Arattai