నంద్యాలలో 25 ఏళ్లుగా అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద వితరణ
NANDYAL Nov10 :- నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మంగళవారం అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు.కార్తీక మాసం మొదటి రోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు ప్రతిరోజూ అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ కొనసాగిస్తామని తెలిపారు.
Arattai