ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీ.. 29న నగదు ఉపసంహరణకు చర్యలు
NANDYAL Oct27:- నవంబర్ 1న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు, నవంబర్ 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో, పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతికి లోబడి అక్టోబర్ 30న పింఛన్ల పంపిణీ చేపట్టేందుకు, అక్టోబర్ 29న నగదు ఉపసంహరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత రీజినల్ మేనేజర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బ్యాంకు శాఖల్లో తగినంత నగదు అందుబాటులో ఉండేలా చూడాలని, నగదు కొరత కారణంగా పింఛనుదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పింఛన్ల పంపిణీని సజావుగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Arattai