స్పటిక లింగేశ్వర ఆలయంలో ఆశ్వీయుజ మాస మాస పౌర్ణమి హోమాలు
NANDYAL Oct 26 :- నంద్యాల పట్టణం, హౌసింగ్ బోర్డు కాలనీలో వెలసిన అమ్మ స్పటిక లింగేశ్వరాలయం,అమరయోగ వికాస కేంద్రం నందు ఆశ్వీయుజ మాస పౌర్ణమి పురస్కరించుకుని నిర్వాహకులు యోగనంద ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

స్పటిక లింగేశ్వరునికి ఇక పూజలు అభిషేకాలు, అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామికి పంచామృత అభిషేకం, అనంతరం లోక కళ్యాణార్థం శాంతిహోమాలను నిర్వహించినట్లు యోగానంద తెలిపారు.లోకకళ్యాణం కోసం ప్రతి నెల పౌర్ణమి రోజున ప్రత్యేక హోమాలు నిర్వహిస్తామని తెలిపారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, రఘునాథరెడ్డి, దేవమ్మ, యోగ సభ్యులు పాల్గొన్నారు
Arattai