నంద్యాల మున్సిపాలిటీ ప్రజలు దీవిస్తే సుపరిపాలన అందిస్తాం : సూర్య రాధమధు దంపతులు
NANDYAL Oct 26 :- మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా ప్రజా క్షేత్రంలోకి సూర్య రాధ మధు దంపతులు ప్రయాణం మొదలుపెట్టారు. మున్సిపల్ ఎన్నికల అధికారులు స్వతంత్ర అభ్యర్థులైన సూర్య రాధమధు దంపతులకు గుర్తులకు కేటాయించారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి అయిన పట్నంశెట్టి రాధకు కుండ గుర్తును కేటాయించారు. రైతునగరం 28వ వార్డు స్వతంత్ర అభ్యర్థి పిఎం. లక్ష్మి నరసింహంకు కత్తెర గుర్తును కేటాయించారు.

ఆదివారం ఎన్నికల అధికారులు గుర్తును కేటాయించడంతో సోమవారం ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రైతునగరం వార్డులో సూర మధు నివాసం ఉంటున్న జర్నలిస్టు కాలనీ నుంచి ఎన్నికల ప్రచారానికి స్వీకారం చుట్టారు. సకుటుంబ సమేతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సూర్య మధుకు మద్దత్తుగా ఆయనకు అత్యంత సన్నిహితులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు ప్రచారంలో ఆయన వెంట నడిచారు. సూర్య రాధమధు దంపతులు ఓటర్లను అప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల్లో ఓట్లు వేసి బలపర్చాలని కోరారు.

ఎన్నిక ప్రచారాన్ని ప్రారంభిస్తూ తనని కలిసి విలేకరులతో సూర్య మధు మాట్లాడుతూ సామాన్య కుటుంబం ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామన్నారు. 30సంవత్సరాలకు పైగా పాత్రికేయుల వృత్తిలో పని చేసిన తనకు నంద్యాలలోని ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని వెల్లడించిన రోజు నుంచి పలువురు ప్రముఖులు ఫోన్లో సంప్రదించి ప్రత్యేకంగా అభినందించారని గుర్తు చేశారు. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాకు స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు మద్దత్తుగా నిలిచారన్నారు.
ప్రజలకు అవకాశం కల్పిస్తే నంద్యాల మున్సిపాలిటీతో పాటు రైతునగరం వార్డు అభివృద్దికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం సహకారంతో ప్రజాప్రతినిధులతో కలిసి నంద్యాల మున్సిపాలిటీలో సుపరిపాలన అందించాలని భావిస్తున్నామన్నారు. రైతునగరం వార్డు పరిధిలోని జర్నలిస్టు కాలనీతోపాటు బృందావనం కాలనీలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రతి ఇంట్లో ఓటర్లను కలిశారు. మధు సతీమణితోపాటు కోడళ్లు ప్రతి మహిళకు బొట్టుపెట్టి ఎన్నికల్లో మద్దత్తు ఇవ్వాలని అభ్యర్థించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్ పర్సన్ అభ్యర్థి పట్నంశెట్టి రాధకు కుండ గుర్తుకు, 28వ వార్డు రైతునగరం అభ్యర్థి పిఎం. లక్ష్మినరసింహంకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
Arattai