దేశంలో యువతను C J P తప్పుదోవా పట్టిస్తోంది : నంద్యాల MP డాక్టర్ బైరెడ్డి శబరి.
NANDYAL Oct14 :-భారత దేశంలో యువతను CJP (Cockroach Janta Party )తప్పు ధోవ పట్టిస్తోందని, సీ జె పి కార్యక్రమాలపై యువతను అప్రమత్తం చేయాల్చిన అవసరం ఉందని, విద్యార్థుల్లో అవగాహన పెంపోందించాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.

బుధవారం శ్రీశైలం నియోజకవర్గం వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో నంద్యాల జిల్లా ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ వీరబ్రహ్మం వివాహానికి పార్లమెంట్ సమావేశాల కారణంగా రాలేకపోయానని గుర్తు చేసుకొని వీరబ్రహ్మం, లీలావతి నూతన వధూవదులను బోయిరేవుల గ్రామం విచ్చేసి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆశీర్వదించారు. బోయరేవుల గ్రామానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి రావడంతో పెద్ద ఎత్తున గ్రామంలోని ప్రజలు, యువత బైరెడ్డి శబరి గారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఏ బి వి పి టీమ్ ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేశంలో యువతను తప్పుదావ పట్టిస్తున్న CJP కార్యక్రమం పైన యువతను అప్రమత్తంగా ఉండే లాగా విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, దేశాభివృద్ధిలో యువత అధిక సంఖ్య పాల్గొనే విధంగా చేయాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విద్యార్థి సంఘం నాయకులను కోరారు.
Arattai